మాస్క్ లు,శానిటైజర్స్ ని సిఐకి ఏపిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అందజేత
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:ప్రపంచ మహమ్మారి కరోనా నియంత్రణకై ఏపిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత నిజాముద్దీన్ వారి సిబ్బంది నవాబుపేట్ సిఐ వేమారెడ్డి కి మాస్క్ లు,శానిటైజర్స్ ను అందజేశారు.పోలీసులు కరోనా నియంత్రణకు కీలక పాత్ర పోషిస్తూ వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా,వారి కుటుంబాలను వదిలి విధులు నిర్వర్తిస్తున్న వారికి ఏపిఆర్ ఫౌండేషన్ చేయూతనిచ్చింది.ఈ కార్యక్రమంలో ఏపిఆర్ ఫౌండేషన్ సిబ్బంది, కానిస్టేబుల్ లు వెంకటేశ్వర్లు, హరి తదితరులు పాల్గొన్నారు. #ఎస్పీన్యూస్#