అభాగ్యులకు ఆపన్న హస్తమందించిన శేషు గౌడ్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నెల్లూరు సిటీ,రూరల్ నియోజకవర్గ పరిధిలోని అభాగ్యులకు వై వైయస్సార్ స్టూడెంట్ యూనియన్ నగర అధ్యక్షుడు శేషు గౌడ్ ఆపన్న హస్తమందించారు.స్థానిక ముత్తుకూరు గేట్,బివి నగర్., అయ్యప్ప గుడి, బారా షాహిద్ దర్గా, గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్టీసీ, వి ఆర్ సి, ఆత్మకూరు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో రోడ్ సైడ్ అభాగ్యులకు ఆహార పొట్లాలను పంచి పెట్టారు.ఒక ప్రక్క కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ నేపథ్యంలో అభాగ్యులకు ఆహారం దొరకడమే కష్ట తరంగా మారింది.వారికి చేయూత నివ్వాలనే మంచి ఆలోచనతో విద్యార్థి నాయకుడు కథం త్రొక్కి ముందుకు నడిచాడు.గత నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల్లో అభాగ్యులకు కడుపు నింపుతున్నాడు.శేషు అనే పేరులోనే సేవాగుణం...శాంతసేవ చేస్తూ నిజమైనసేవాపరుడిగా అన్నార్తులకు సేవ చేస్తున్నాడు ఈ విద్యార్థి నాయకుడు శేషు.ఈ సేవా కార్యక్రమంలో నవీన్, శ్రీకాంత్, రాజేష్, రణదీప్, మురళీ ,కళ్యాణ్,సాయి కిషోర్, వంశీ,అభిషేక్, మనోజ్, కమల్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#