రూరల్ నియోజకవర్గ ప్రజల దేవుడిగా "శ్రీధర్ రెడ్డి"
న్యూస్ ఫోర్స్,(నెల్లూరు,వియం):నిత్యం ప్రజల్లో తిరుగుతూ..ప్రజా రంకిత పాలన అందిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తూ రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టమొచ్చిన తానున్నానంటూ భరోసా నిచ్చే ప్రజా దేవుడిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ ప్రజలు పిలుచుకుంటున్నారు.కరోనా వైరస్ నియంత్రణకై రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు ఒక సేవకుడిగా ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు.అలాగే నిరుపేదల ఇంటికి తానే స్వయంగా కూరగాయలు, బియ్యాన్ని సరఫరా చేశారు.ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి చేస్తున్న సేవలకు కొందరు దాతలు ముందుకు వచ్చి పేదలకు చేయూతనందిస్తున్నారు.తన నియోజకవర్గ పరిధిలో కులమత భేదాలు లేకుండా అందరిని తన కుటుంబ సభ్యులుగా ఆయన భావిస్తూ వారికి అండగా వుంటున్నారు.ప్రజలకు ఏ కష్టమొచ్చిన తానున్నానంటూ ముందుకు వచ్చి వారిని ఆ కష్టం నుండి బయటపడేస్తారు.ఒక శాసనసభ్యులుగా కాక రూరల్ నియోజకవర్గ ప్రజా సేవకుడిగా ప్రజలు మన్నలలందుకుంటున్నారు.ప్రజా నాయకుడు అన్నా.. ప్రజా సేవకుడిగా అన్నా.. ఇలానే ఉండాలని ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే నిదర్శనం. చిన్న వాళ్ళతే శ్రీధరన్నా అని పిలిచుకుంటుంటారు.పెద్దవారు అయితే ముద్దుగా శ్రీధర్ అని పిలుస్తుంటారు.ప్రతి ఒక్కరినీ ప్రేమ పూర్వక పలకరింపులే ఆయన అభిమతం ఆయన తిరుగులేని గెలుపుకునాంది.చిన్న,పెద్ద,ధనిక,పేద అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలుకరించడమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నైజం. ప్రజలు కూడా ఆయనని నాయకుడిగా కాక తమ కుటుంబంలో ఓ వ్యక్తిగా రూరల్ నియోజకవర్గ ప్రజలు అభిమానిస్తున్నారు.ఎవరింటి తలుపు తట్టిన ఆయన పేరు తలుచుకోనిదే రోజు గడవదనేది చెప్పవచ్చు.ప్రజలకు సేవ చేయడమనేది ఎంతో గొప్పవరం.. దానిని కూడా ప్రేమ,ఆప్యాయతలు మధ్య ప్రజలని కలుపుకుని వెళ్లే మనసున్న మారాజుల శ్రీధర్ రెడ్డి నిలిచిపోయారనేది జగమెరిగిన సత్యము. ప్రజల్లో కొందరే నిలుస్తారు..వారిలో కూడా ఆజన్మాంతం చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచిపోయేవారు అరుదు వారిలో శ్రీధర్ రెడ్డి ఒకరని చెప్పకనే చెప్పవచ్చు.#ఎస్పీన్యూస్#