సర్వేపల్లిని "సిరులు" పల్లిగా మార్చిన కాకాణి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది.ఎంతమందిని రాజకీయంగా వెలుగులోకి తీసుకొచ్చిన నియోజకవర్గం ఈ సర్వేపల్లి.అలాంటి సర్వేపల్లిలో వరుసగా రెండు పర్యాయాలు విజయ ఢంకా మ్రోగించి తనకు తిరుగులేదనిపించుకున్నారు కాకాణి.అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలకు తానున్నానంటూ భరోసానివ్వడమే కాదు అంతే రీతిలో ఆదుకోవడంలో వారికి దేవుడుగా మారిపోయారు.కష్ట కాలంలో అన్ని రకాలుగా తన నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారికి చేయూత నిస్తున్నారు.ఒక ఎమ్మెల్యేగా కాక ప్రజలకు ప్రజా సేవకుడిగా వారికి సేవలందిస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి.పూర్వం ద్వాపరయుగంలో అకాల వర్షంతో గాలి,వానకు అల్లాడుతున్న ప్రజలకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన ఒంటి చేత్తో ఎత్తి ప్రజలకు నీడనిచ్చి వారి ప్రాణాలను కాపాడారు.ఇపుడు ఈ కలియుగంలో ప్రజలకు కరువు లేకుండా...కరోనా వైరస్ నివారణకు ఒక ప్రక్క చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ వలన ప్రజలకి కడుపు నింపుతూ వారి పాలిట గోవర్ధన గిరుడయ్యాడు.ప్రతిఒక్క కుటుంబానికి ఉచిత బియ్యం, కూరగాయలు అందిస్తూ వారికి ఆపన్న హస్తమందిస్తున్నారు.అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క గ్రామానికి, మండలానికి మాస్క్ లు,శానిటైయిజర్స్ అందిస్తూ కలియుగ గోవర్ధనుడుగా సర్వేపల్లి ప్రజలు పిలుచుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే గా ప్రజలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.అలాగే ఆ నియోజకవర్గ రైతులు కూడా ఎమ్మెల్యే సంకల్పానికి మద్దతుగా నిలుస్తూ వేల పుట్లు బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు.దీనితో
ఏ నోట విన్న కాకాని మా దేవుడు..మా పాలిట దైవమని ఆ భగవంతుడు మా కోసమే ఆయనని పంపించారంటూ ప్రజలు అంటున్నారు.అంతే కాదు కనిపించని దైవంకి మొర పెట్టుకుంటే రెండు మూడు రోజులు పడుతుందేమో..కానీ కనిపించే నిలువెత్తు కలియుగ దైవం కాకాణికి మొర పెట్టుకుంటే రెండు మూడు గంటల్లోనే తమ సమస్య పరిష్కారం అవుతున్నదని సర్వేపల్లి ప్రజలు చెప్పుతున్నారు. ఏ స్థాయిలో ఆయన సేవలు చేశారో ఆ నియోజకవర్గ ప్రజల మోములో కనపడుతుంది.ప్రజా క్షేత్రంలో రాజకీయ నాయకులుగా ఎంతో మంది ఒక వెలుగు వెలుగుతారు.కానీ జనం గుండెల్లో కొందరికే ఆచోటు ఉంటుంది.అటువంటి వారిలో కంటే కాకాని ఆ నియోజకవర్గ ప్రజలకు దేవుడుగా మారిపోయి.. సర్వేపల్లి నియోజకవర్గాన్ని సిరులు పల్లి గా మర్చివేశారని చెప్పవచ్చు.#ఎస్పీన్యూస్#