డివిజన్ లో కరోనా నివారణకు సోడియం హైపో క్లోరైడ్
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:నగరంలోని 9వ డివిజన్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా బంగ్లాతోట ప్రాంతంలోని పలు వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ దగ్గరుండి చల్లించారు.మునిసిపల్ కార్పొరేషన్ డిఈ శ్రీనివాసులు పాల్గొని పలు వీధుల్లో క్లోరైడ్ ద్రావణాన్ని దగ్గరుండి చల్లారు.ప్రతి వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటి వద్ద ,గోడలపై, రోడ్డుపై సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లిస్తూ ప్రజలను పలకరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యనమల పాలెం,పుల్లమ్మ సత్రం లోని పలు వీధుల్లో కూడా క్లోరైడ్ ద్రావణాన్ని చల్లిస్తూ సాయంత్రం7గంటల నుండి రాత్రి 10:45వరకు పలు వీధులు తిరిగారు.అలాగే ఈ కార్యక్రమంలో నవాబుపేట్ శివాలయం ఛైర్మన్ వంగాల శ్రీనివాసులు రెడ్డి,వైసీపీ కార్యకర్తలు మురళి,మునిసిపల్ సిబ్బంది సింగ్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#