ప్రమాదబారిన పడి ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి 10వేలు ఆర్థికసాయం



 State politics news {kavali}:

 ప్రమాదబారిన పడి ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి  కావలి గౌడ్ సంఘం ఆర్థికసాయం అందజేశారు.నెల్లూరు జిల్లా, కావలి డివిజన్ గౌడ్ కల్లుగీత పారిశ్రామికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం  కావలి మండలం, తాళ్లపాలెం పంచాయతీ లోని జువ్విగుంట పాలెం గ్రామానికి చెందిన కుడుముల రాంబాబు గౌడ్ ,అనంతలక్ష్మి దంపతులు నలుగురు ఆడపిల్లలు ఆటోలో ప్రయాణిస్తున్న ప్రమాదం చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న కావలి గౌడ్ నాయకులు వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి వాళ్లకి మనోధైర్యం అందించినారు .ఈ సందర్భంగా కావలి డివిజన్ అధ్యక్షులు మోర్ల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా గౌడ్ సేవా సమితి అధ్యక్షుడు కోసూరు గోవిందయ్య గౌడ్ స్ఫూర్తి తో ఇలాంటి కార్యక్రమాలలో బాధితులను తమ వంతు సహాయం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షులు ఇసారపు వెంకటరత్నం గౌడ్, రూరల్ అధ్యక్షుడు ఆలపాక రవి గౌడ్,పట్టణ కోశాధికారి పంది పెంచలయ్యగౌడ్, పట్టణ కార్యవర్గ సభ్యులు మోర్ల పోతురాజు గౌడ్ పాల్గొన్నారు.