State politics news(kavali):
నలుగురు పిల్లలతో కలిసి ఓ నిరుపేద కుటుంబం ఆటోలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో యాక్సిడెంట్ జరగడం తో ఇద్దరు కుమార్తెలకు కాళ్లు ఫ్యాక్చర్ అయ్యాయి.విషయాన్ని తెలుసుకున్న కావలి డివిజన్ గౌడ సంఘం అధ్యక్షుడు పంది పెనుగొండయ్య గౌడ్ వారి కుటుంబానికి సోమవారం ఆర్ధిక భరోసా కలిపించారు. మండలంలోని తాళ్లపాలెం పంచాయతీలో జువ్విగుంట పాలెం గ్రామానికి చెందిన కుడుముల రాంబాబు, అనంతలక్ష్మి దంపతులకు నలుగురు ఆడపిల్లలు.ఆ దంపతులు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు.దీనితో వారింట్లో ఈ విషాదంతో కుటుంబ భారంగా మారింది. దీనితో స్పందించిన కావలి గౌడ్స్ ఆ కుటుంబానికి ఆపన్న హస్తమందించారు.
పారిశ్రామిక వేత్త తుళ్ళూరు మాల్యాద్రి గౌడ్ పది వేల రూపాయలు, కావలి డివిజన్ గౌడ సంఘ సభ్యులు మరో పది వేల రూపాయలు మొత్తాన్ని కావలి 1 వ పట్టణ సిఐ కాటూరి శ్రీనివాసరావు గౌడ్ చేతులు మీదుగా ఆ కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో కావలి పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు సురగాని శ్రీనివాసులు గౌడ్ , పట్టణ ఉపాధ్యక్షుడు తుళ్ళూరు శ్రీనివాస్ గౌడ్ , పట్టణ ప్రధానకార్యదర్శి సురేష్ గౌడ్ , నెల్లూరు జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు ఎమ్మెస్ గౌడ్ ,బండ్ల వేణు గౌడ్ , జోగి కృష్ణ గౌడ్ , రావుల కోటి గౌడ్, సుబ్రమణ్యం గౌడ్ , బాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.