ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 


State politics news {nellore}:

 475 పరిశోధనా పత్రాలు ప్రచురించిన రామన్ ఐదు మోనో గ్రాఫులు వెలువరించారని ఎన్. ఎస్. ఎస్. డిస్ట్రిక్ ఆఫీసర్ డాక్టర్ ఎ. ఉదయ్ శంకర్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగరం,బాలాజీ నగర్ లోని శ్రీచైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అనేక ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక శాస్రంలో మౌలిక స్థానం ఆక్రమించిన 'రామన్ ఫలితం' సాధించడానికి ఆయన కేవలం 200 రూపాయల విలువైన పరికరాలను మాత్రమే ఉపయోగించారని తెలిపారు. పినాకిని యూత్ వెల్ఫేరే అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు మాట్లాడుతూ భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేత, భారతరత్న చంద్రశేఖర్ వెంకటరామన్ తాను సాధించిన 'రామన్ ఎఫెక్ట్' 1928 ఫిబ్రవరి 28న ఆవిష్కరించారని వివరించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ కె.ఎస్.వి.కిరణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.మణికంఠ, డీన్ శ్రీనివాసులు, టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.